
మెహిదీపట్నం, (హైదరాబాద్) నేటి ధాత్రి:
వృద్ధురాలికి అండగా నిలిచిన అక్షిత ఫౌండేషన్ చైర్మన్ రాపాక సన్నీ కుమార్. కనీస సౌకర్యాలు లేని స్థితిలో జీవిస్తున్న ఒక వృద్ధురాలి గురించి స్థానిక రిపోర్టర్ అక్షిత ఫౌండేషన్ కు తెలుపగా అక్కడికి వెళ్లి వారికి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త బట్టలు,బెడ్ షీట్ లు, కొంత ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఒక రైస్ బ్యాగ్ కావాలని అడగటం తో మరుసటి రోజు వారికి రైస్ బ్యాగ్ మరియు కొన్ని నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది.