
చింతకింది కృష్ణమూర్తి నేత… జనగామ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ప్రచార కార్యదర్శి
రఘునాధపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
మార్చ్2న హైద్రాబాద్లో బీసీ,అణగారిన వర్గాల ఆత్మగౌరవ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక న్యాయం క్రమంగా కనుమరుగవుతున్నదనీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో రాజకీయాల్లో అవకాశాలకు ఆమడ దూరంలో నెట్టివేయబడుతున్నాయని చింతకింది కృష్ణమూర్తి నేత ఓక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం వివిధ పార్టీల విధానాల్లో, మేనిఫెస్టోలలో ప్రచురితమవుతున్నా దానిని అమలు విషయంలో మాత్రం పార్టీలకు చిత్తశుద్ధి కరువవుతుందని పేర్కొన్నారు . ఈ దరిమిలా బీసీ అణగారిన వర్గాల “ఆత్మగౌరవ సదస్సును” మార్చి 2వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు..
సామాజిక మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వంలో సబ్బండ వర్గాలు ఏ విధమైన పరిపాలనను కోరుకుంటున్నాయో స్వయంగా తెలియజెప్పడానికి వివిధ రాజకీయ పార్టీల బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, జర్నలిస్టులు విద్యార్థి, ఉద్యమ ,కార్మిక మహిళా నాయకులు, వివిధ కులసంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెలుబుచ్చనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలల నుండి పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు నేతృత్వం వహించనున్నారని అయన పేర్కొన్నారు.