
# ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ డ్యాగల శ్రీనివాస్.
నర్సంపేట,నేటిధాత్రి :
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్ హెచ్ ఆర్ సి) వార్షికోత్సవ వేడుకలను వచ్చే నెల మార్చి 3 న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాంమని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ డ్యాగల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి. సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐలినేని శ్రీనివాస్ రావుల ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలో జిల్లా ఉపాధ్యక్షులు బేతి భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సేవలు అందించడానికి హ్యూమన్ రైట్స్, ఆర్ టి ఐ యాక్ట్ పై సంపూర్ణ సమాచారంతో పాటు చట్టాలపై సరైన అవగాహన, నియమ నిబంధనలు తెలియజేయడం జరుగుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో భూక్య భధ్రునాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి రవి కుమార్, జిల్లా కార్యదర్శులు, గొడిశాల అశోక్ కుమార్, పసుల అశోక్ కుమార్, జిల్లా ఈసీ మెంబర్లు గుండు నాగవెంకటప్రసాద్ (బాబ్జీ) మద్దెల శ్యామ్, కర్రి శివాజీ, మర్రి క్రాంతి కుమార్, నర్సంపేట పట్టణ కార్యదర్శి గోపగాని నాగరాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు మోడెం మౌనిక, కాసుల లక్ష్మణాచారి, దేశి సందీప్, దేశి పావని సారంగం తదితరులు పాల్గొన్నారు.