
ముఖ్య అతిధిగా కౌన్సిలర్ సంపత్
పరకాల నేటిధాత్రి
బుధవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల జెడ్పిహెచ్ ఎస్ బాలికల పాఠశాల లో విద్యార్థులకు వ్యాస రచన,క్విజ్ తో పాటు పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసారు.విద్యార్ధులు వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను,ఉపయోగాలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపల్ ముఖ్య అతిధిగా ఇచ్చేసి సివి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్బంగా సంపత్ మాట్లాడుతూ సైన్స్ పట్ల భవిషత్తు శాస్త్రవేత్తలుగ తయారు కావాలని అన్నారు.దేశానికి పేరు తీసుకువచ్చే విధంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.