
నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ లలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని బుధవారం విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల సైన్స్ కు
సంబంధించిన అంశాలను చార్జ్ మరియు ఎక్సిబిట్స్ రూపంలో ప్రదర్శించారు. ముఖ్యంగా
జీర్ణక్రీయ వ్యవస్థ, అడవుల నరికివేత, వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు,
కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తినడం వలన లభించే పోషక విలువల గురించి,
వాతావరణ కాలుష్య నివారణ పలు ప్రాజెక్టులపై విద్యార్థిని విద్యార్థులు వివరించారు. అదే విధంగా
ఆదిత్య ఎల్-1, చంద్రయాన్ 3 వంటి అంశాలపై ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించిన తీరు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర
ప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి. శాస్త్రీయ,
సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు
ప్రదర్శించిన ఎక్సిబిట్లను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్
డాక్టర్ ఏ.వనజ మేడమ్, ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ ,సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, సి.ఎవొ సురేష్,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.