
మందమర్రి, నేటిధాత్రి:-
టైలర్స్ డే వేడుకలను పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో మేరు కుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యాపారస్తుల కమిటీ చైర్మన్ తమ్మిశెట్టి విజయ్ కుమార్, మంద తిరుమల్ రెడ్డి, గంప ఆంజనేయులు, గుడ్ల శ్రీను లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరు కుల దైవం జతగిరి శంకర దాసమయ్యా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మేరు సంఘం అధ్యక్షుడు రాయబారపు వెంకన్న మాట్లాడుతూ, టైలర్స్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో టైలర్స్ రావడం సంతోషంగా ఉందని అన్నారు. గౌరవ అధ్యక్షురాలు రాయబారపు జనార్దన్ మాట్లాడుతూ, టైలర్స్ డే వేడుకలకు మేరు కులస్తులు, మార్కెట్ మహిళా టైలర్స్ రావడం ఆనందంగా భావిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యక్షుడు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, దర్జా లేని దర్జా బ్రతుకులు తమ మేరు కులస్థులదని, అటువంటి దినమైన పరిస్థితి లో ఉన్నా టైలర్స్ ని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రవీందర్, కోశాధికారి మామిడిశెట్టి సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు గట్ల సారంగపాణి, గంగన్న, కర్నే వెంకన్న ,గజనాల రాజనర్సు, మామిడిశెట్టి శ్రీనివాస్, మార్కెట్ టైలర్స్ షాపుల యజమానులు, మహిళా టైలర్స్ తదితరులు పాల్గొన్నారు.