
బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుంచి కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ పార్టీ కార్యాలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని కార్యకర్తలు మరింత ముందుకు సాగేందుకు నూతన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడే కోసం ఆరు గ్యారెంటీలు ముందుకు తీసుకువచ్చారు ప్రతి ఒక్కరికి అందుతుందని తెలియజేశారు. ప్రజలు ఆరేపల్లి మీదుగా పెద్దాపూర్ వెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా పాత పైపులైను పునరుద్ధరించడం గాని, కొత్తగా బోర్ వేయడం గాని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, అధికార ప్రతినిధి చిందం రవి, ప్రపంచ రెడ్డి, బాసాని మార్కండేయ, దుంపల తిరుపతి రెడ్డి. వల్పదాసు రాము ,గ్రామ అధ్యక్షుడు నాగలగాని వీరన్న, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి బుచ్చిరెడ్డి, రాజేశ్వరరావు, ఎడ్డే సుమన్, మారేపల్లి క్రాంతి, రాజయ్య, సాదు నాగరాజు, బూర్గుల రాజ్ కుమార్, వరదరాజు తదితరులు పాల్గొన్నారు.