
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా)
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ మీదుగా గుండాల సెంటర్ కి చేరుకుంది. ఈ సందర్భంగా కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, పార్టీ జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్ లు మాట్లాడుతూ సిపిఐ( ఎంఎల్) ప్రజాపందా, పిసిసి సిపిఐ( ఎంఎల్), సిపిఐ(ఎంఎల్)ఆర్ఐ మూడు విప్లవ పార్టీలు ఐక్యమై మార్చి 3, 4 ,5 తేదీలలో ఖమ్మం పట్టణంలో జాతీయ మహాసభలు జరుపుకొని భారతదేశంలోనే ఒక బలమైన విప్లవ పార్టీ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ గా ఆవిర్భవిస్తుందని అన్నారు. భారతదేశాన్ని అనేక సామ్రాజ్యవాద శక్తులు దోపిడీ చేస్తున్నాయని, ఇండియా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని చాలా ప్రమాదకరమైన మనువాద హిందుత్వ కార్పోరేట్ ఫాసిస్టు, మతతత్వ రాజ్య స్థాపన ను ఎదుర్కొనటానికి ఫాసిస్టు వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని, ఎన్నికల వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిందని, ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలపై ఎన్నో రకాల దాడులను చేస్తున్నదని, ముఖ్యంగా అనగారిన వర్గాల జీవనంపై వారి జీవన ఉపాధి పై దాడులు చేస్తున్నదని, ముస్లిం మైనార్టీలపై దాడులు మరింత తీవ్రతరం చేసిందని విమర్శించారు. మార్చి మూడో తేదీన ఖమ్మం నగరంలో జరిగే భారీ బహిరంగ సభను, ప్రజా ప్రదర్శనను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) నాయకులు బొర్రా వెంకన్న, పూనేం మంగయ్య, తేల్లం రాజు, సనప కుమార్ దుగ్గి రియాజ్, ఈసం కృష్ణ, కోడూరి జగన్ మోకాళ్ళ ఆజాద్, పూనెం లక్ష్మన్న, ఈసం సింగన్న, యనగంటి గణేష్, వాగబోయిన మోహన్ రావు, పూనెం ప్రభాకర్, ఈసం లక్ష్మీనారాయణ, మోకాళ్ళ పోతయ్య, పూనెం సుధాకర్, ధరావత్ మోహన్ ,జాటోత్ గణేష్, కొమరం రంగన్న, వజ్జ ధర్మరాజు, ఈసం ప్రభాకర్, కుంజా నరేష్, మోకాళ్ళ పాపారావు, కుంజ నాగేష్, వట్టం కృష్ణ, స్వర్ణభాక సత్యం, ఈసం నరేష్, ఈసం ప్రభాకర్,సనప కీశెందర్ తదితరులు పాల్గొన్నారు.