పశువుల కాపరులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు

స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఫారెస్ట్ శాఖ అధికారుల వేధింపులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి

సిపిఎం పార్టీ డిమాండ్

చెన్నూర్, నేటిదాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూర్,కొటపల్లి,వేమన పల్లి,భీమారం మండలాల్లో మేకలు,గోర్లు,బర్లు,పశువులు తమ ఆకాలి తీర్చుకోవడం కోసం సమీపంలోని అటవీ ప్రాంతం లోకి వాటిని మేపడం కోసం కాపాలదారులు తీసుకువెళ్ళుతే పారెస్ట్ శాఖ అధికారులు మూగజీవాలను, కాపాలాదారులను తీవ్రంగా వేదింపులకు గురిచేస్తున్నారు.రూ:5000 నుంచి రూ:,10000/ వరకు పెనాల్టిలు వేస్తున్నారు.మూగజీవాలను ,కాపాలదారులను ఫారెస్ట్ శాఖ కార్యాలయంలో బంధించడం జరుగుతుంది.రక్షణ కోసం తీసుకు వెళ్లిన గొడ్డల్లను తీసుకోవడం జరుగుతుంది.అదే విధంగా నోటికి వచ్చినట్లు బూతు పదాలతో తిట్టడం జరుగుతుంది.
ఫారెస్ట్ శాఖ అధికారులు వేదింపులు నిలిపివెయ్యాలి,
లేకుంటే సిపిఎం అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెయ్యడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో
సంకే రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి,
బొడెంకి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,
చెన్నూర్ మండల నాయకులు
సిడం సమ్మక్క, రాతిపల్లి నగేష్, ఎస్.పోషక్క, కరీమా,యామిని,రమాదేవి, రామగాని సమ్మక్క, భూర్తి వెంకట స్వామి,కుమ్మరి బాపు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!