ఆరు నెలలుగా వెలగని సెంట్రల్ లైటింగ్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఇందారం బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను 7/10/2023నాడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించినారు, కానీ నేటి కీ ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేషన్ కు సంబంధించిన మొత్తాన్ని హెచ్ కె ఆర్ సంస్థ చెల్లించనందున గడిచిన ఆరునెలలుగా సెంట్రల్ లైటింగ్ వెలుగులు చిందించక వృధాగా ఉన్నవి,దీనిపై ఇందారం ఎంపిటీసి -2అరికె స్వర్ణ-సంతోష్ యాదవ్ హెచ్ కె ఆర్ యాజమాన్యం స్పందించి సెంట్రల్ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేషన్ కు సంబంధించిన మొత్తాన్ని చెల్లించి సెంట్రల్ లైటింగ్ వెలుగులతో ఇందారం హైవే పై కాంతులు వెదజల్లేలా చర్యలు తీసుకోవాలని అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు సర్వీస్ రోడ్డుపై అడ్డంగా ఉన్న మిషన్ భగీరథ పైపును, సైడ్ డ్రైన్లో ఉన్న కరెంట్ స్తంభాలను కూడా ప్రక్కకు జరిపి వేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ కె ఆర్ ప్రతినిధి, టోల్ ప్లాజా ఇంఛార్జి రామకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అరికె స్వర్ణ-సంతోష్ హెచ్ కె ఆర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్ లో సంప్రదించి మాట్లాడగా తమ ప్రతినిధులను పంపించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అరికె స్వర్ణ-సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరికె సంతోష్ యాదవ్,సూదుల రాజబాబు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!