
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ .అనంతరం మాట్లాడుతూ ఈనెల 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అదేవిధంగా మండలాలలో సంబంధించి చదువుకుంటున్న విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లకు టైం కు వచ్చే విధంగా దూర ప్రాంతాలు ఉండచే విద్యార్థులు అందరికీ కూడా బస్ సౌకర్యం కల్పించాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా దూర ప్రాంతాలు అయినటువంటి మహాదేవపూర్ పలిమేల పంకన మహముత్తారం చిట్యాల రేగొండ తదితర ప్రాంతాలలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్స్ కు సంబంధించి విద్యార్థులు అందరూ కూడా సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్స్ రావడానికి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా బస్ సౌకర్యం కల్పించి కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్స్ సెంటర్స్ లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 28 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు విద్యార్థులు అందరూ కూడా సకాలంలో దూరప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరి రాజు విష్ణు వంశీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు