ఓరుగల్లు సిటిజన్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఆత్మీయ పౌర సన్మానం హన్మకొండలోని డి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ” ఓరుగల్లు హోమియోపతి మెడికల్ అసోసియేషన్” (ఐ ఐ హెచ్ పీ )”, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ ” హనుమకొండ – వరంగల్ కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఆరోగ్య దర్శిని పక్షపత్రిక తొమ్మిదో వార్షికోత్సవ సంచికను గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐ .ఐ .హెచ్. పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు , ఆరోగ్య దర్షిని పక్షపత్రిక ఎడిటర్ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, ఓరుగల్లు హోమియోపతి మెడికల్ అసోసియేషన్
గౌరవ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రావు, అధ్యక్షులు డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. రాంబాబు, ట్రెజరర్ డాక్టర్ బాసాని శ్రీకాంత్ పాల్గొన్నారు.
త్రిపుర గవర్నర్ ను ఘనంగా సన్మానించిన హోమియో డాక్టర్స్
