
శేరిలింగంపల్లి నేటి ధాత్రి:-
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. దేవాలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు,గోపనపల్లి గ్రామం వాసులు, స్థానిక నేతలు, భక్తులు,మరియు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.