భూపాలపల్లి నేటిధాత్రి
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యాం ఆధ్వర్యంలో నూతన టియుడబ్ల్యూజే ( ఐజేయు) డైరీని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆవిష్కరించారు.
అనంతరం ఇటీవల నూతనంగా భూపాలపల్లి జిల్లా డిపిఆర్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ కు ఐజేయు సంఘము ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి చింతల కుమార్ యాదవ్,సీనియర్ జర్నలిస్ట్ సమ్మయ్య గౌడ్,శనిగరం లక్ష్మన్,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సాంబయ్య,చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్,రజినీకాంత్, సంతోష్,చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాము,మల్లయ్య,రమేష్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ పత్రికల్లో ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పది గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఐజేయూ నాయకులు కోరగా జిల్లా కలెక్టర్ బవేస్ మిశ్రా సానుకూలంగా స్పందించారని ఐజేయు నాయకులకు తెలిపారు.