Date 27/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వారణాసి(బనారస్,కాశీ)లో పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరయ్యారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మంగళవారం ఛైర్మన్ రమేష్ విధురియ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశమైంది.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో పెట్రోల్,డీజీల్, వంటగ్యాస్ సరఫరాలకు సంబంధించిన తీరుతెన్నులు, నెలకొన్న సమస్యలు,వాటి సత్వర పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశం చర్చిస్తుంది.ఈ సమావేశంలో స్థాయి సంఘం సభ్యులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు,సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.-Pulipati Damodar PRO to Vaddiraju Ravichandra MP Gaaru
ఎంపీ వద్దిరాజు వారణాసిలో
