జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఇల్లందకుంట మండల పరిధిలోని వంతడుపుల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను సోమవారం ఇలందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ సీజ్ చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా.. పోతుగల్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను వంతడుపుల గ్రామ శివారులో ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంత్రాలకు తరలించేందుకు సుమారు 20 ట్రిప్పుల ఇసుకను సిద్ధం చేసి ఉండగా… రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లు, ఓనర్ల పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇట్టి ఇసుకను తహసిల్దార్ కు అప్పగించడం జరిగిందని తెలిపారు. అక్రమంగా ఇసుకను అనుమతి లేకుండ తరలించే వారు ఎంతటివారైన ఉపేక్షించేది లేదని. కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు ఇసుక అవసరముంటే ప్రభుత్వ నిబంధనల మేరకు మీ-సేవ కేంద్రాలలో ధరఖాస్తూ చేసుకోని ఇసుకను తెప్పించుకోవాలని సూచించారు.