యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ నేటి ధాత్రి:
సోమవారం నాడు చౌటుప్పల్ లోని జయశ్రీ ఫంక్షన్ హలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ వసతి గృహాల విద్యార్థినీ విద్యార్డులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ తరగతులను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…… విద్యార్థినీ విద్యార్థులు తమ చదువు, భవిష్యత్ పట్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రేరణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే సరైన ఆలోచనతో సాధన ముఖ్యమని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్పవారి జీవితాలను గమనిస్తే చదువు, శిక్షణ, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఒక ఇంధనంగా ఉపకరించాయని అన్నారు. సామాజిక మాధ్యమాల వాడకం పెరిగినందున విద్యార్థులు వాటిపై మొగ్గు చూపి తమ విలువైన సమయాన్ని కోల్పోవద్దని, అవసరం మేరకే సామాజిక అంశాలను వినియోగించుకోవాలని అన్నారు.
ప్రముఖ సైకాలజస్ట్ డాక్టర్ పి.లక్ష్మణ్ జీవితంలో విజయం సాధించాలంటే, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలంటే తీసుకునే నిర్ణయాలు, సాధనల పట్ల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కలిగించారు.
కార్యక్రమంలో ఇంటర్మిడియట్ జిల్లా అధికారి
రమణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.