రైతుల న్యాయమైన డిమాండ్ల ను నెరవేర్చాలి
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులపై దాడి చేపిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి చంద్రమౌళి మాట్లాడుతు ఫిబ్రవరి 13వ తేదీన 200 రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింధన్నారు. రైతులను డిల్లీకి రాకుండా హర్యానా రాష్టం లో డిల్లీ సరిహదులో పోలీస్ బలగాలను ఉపయోగించి లాటి చార్జ్,బాష్ప వాయు,రబ్బర్ బుల్లెట్ లతో,ఇనుప కంచెలతో రైతులపై దాడి చేపించిన కేంద్ర ప్రభుత్వనికి త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రైతులకు పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులకు క్షమాపణ చెప్పిన మోది మరోసారి రైతులపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే రైతులకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలాని లేనియెడల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజు సతీష్,నూకుల చంద్రమౌళి,వేముల శ్రీకాంత్,పీక రవి, అరబోయిన వెంకటేష్, పొనగంటి లావణ్య, వైధ్య వెంకటేశ్వర్లు,గోలి లావణ్య,ఎండ్ సాబీర్,లొకిని రమేష్,వనిత,యాకుబ్ పాషా, రమేష్ చారి తదితరులు 200మంది సభ్యులు పాల్గొన్నారు.