జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 52 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
హైదరాబాద్ లోని ప్రజా భవన్ నుండి సిఫార్సు చేసిన ప్రజా సమస్యలకు వెనువెంటనే పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు
ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు