ముత్తారం :- నేటి ధాత్రి
స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంపై ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేశారు…సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం,మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ శ్రీపాదరావు మంథని నియోజక వర్గంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించారని విద్యకు పెద్దపీట వేసి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు జరపడం అర్శించదగ్గ విషయమని పేర్కొన్నారు… అలాగే ఐటి శాఖ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్ఆర్జిఎస్ నిధుల నుండి 6 కోట్ల రూపాయలు విలువచేసే సీసీ రోడ్లను మండలానికి మంజూరు చేయించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం నూతనంగా ఎన్నికైన సిoగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు ని శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు