-ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మొక్కిన మొక్కు నెరవేరడంతో పాదయాత్ర
కొనరావుపేట, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని మొక్కిన మొక్కు నెరవేరడంతో సోమవారం కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా తన స్వగ్రామం బావుసాయిపేట గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ పెద్దగుట్ట దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు.నేటి నుంచి పాదయాత్రగా వెళ్లి ఈనెల 29న దర్గాకు చేరుకొని మొక్కులు చెల్లించుకొనునట్లు తెలిపారు.