
మహిళలను అభినందించిన విదేశీ వనిత
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, గంగిరేణి గూడెం గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్&డం ప్రాజెక్ట్ కార్యక్రమాలను పరిశీలన చేయడం కొరకై అమెరికాకు చెందిన బీసీఐ ప్రతినిధి కార్న వాతావరణ మార్పు ప్రోగ్రాం కోఆర్డినేటర్ దివ్య గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో మాట్లాడుతూ నిస్సయిత నేలలో సేంద్ర కార్బన్ ఎంతో మంచిదని అమెరికా చెందిన బీసీఐ ప్రతినిధి కార్ని అన్నారు రైతులందరూ పంటల దిగుబడి సాధించడం కొరకై నేలలో రసాయనిక ఎరువులను వాడడం వల్ల నేలలో నిస్సాయిత స్థితిలో మారి సరైనటువంటి దిగుబడులు రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురైన పరిస్థితులు ఎదుర్కొం టున్నారని దీని గాను ప్రజ్వల్ సహకారంతో గ్రామాలలో మహిళల చేత తయారు చేస్తున్నటువంటి వర్మి కంపోస్టును విధానాన్ని మహిళల చేత వివరణగా తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ నేలల్లో రసాయనకి ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయంగా వర్మి కంపోస్టును సేంద్రకర్బనం వేయడం వల్ల నేల సారవంతంగా మారి నాణ్యమైన దిగుబడును సాధించుకోవచ్చు అని తెలిపారు. అనంతరం వాతావరణ మార్పు ప్రోగ్రాం కోఆర్డినేటర్ దివ్య మాట్లాడుతూ వాతావరణంలో మార్పులకు అనుకూలంగా ప్రత్యమ్నయ మార్గాలకు రైతులందరూ సహకరించాలని దానికి అనుకూలంగా నేలల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులను వినియోగాన్ని తగ్గించి సేంద్ర ద్రవ , ఘన పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు. దీని ద్వారా వాతావరణకు మార్పులకు అనుగుణంగా మారడం వల్ల నేల సారవంతమై నాణ్యమైన దిగులు సాధించుకోవచ్చని సూచించారు. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ అసోసియేట్ డైరెక్టర్ పుల్లూరు వంశీకృష్ణ మాట్లాడుతూ నేల డబ్ల్యూ డబ్ల్యూ వారి సహకారంతో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం గత 18 సంవత్సరాల నుండి కార్యక్రమాల అమల్లో భాగంగా రైతులకు వెన్నుంటి అర్దికంగా మెరుగుపడే జీవనోపాదులను పెంపొందించడం కొరకై అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనుకూలంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం పరుచు కోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో పెద్దపల్లి రామ్మూర్తి ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్ ప్రాజెక్టు మేనేజర్ ఇన్నారెడ్డి పి యు మేనేజర్లు ప్రియాంక రెడ్డి బత్తిని శ్రీనివాస్ అక్కల రమేష్ శాయంపేట మరియు రేగొండ క్షేత్ర సిబ్బంది వివిధ గ్రామ మహిళలు ప్రియదర్శిని అరుణ వర్మి కంపోస్ట్ తయారీ దారులు పాల్గొనడం జరిగింది.