
నేటిధాత్రి మల్కాజ్గిరి
దేశంలో మోడీ పాలనకు ఆకర్షితులై మహిళలు యువత బిజెపిలో చేరుతున్నట్లు బిజెపి నేషనల్ ఇన్చార్జ్ ఉమెన్స్ పాలిటిక్స్ అండ్ రీసెర్చ్ కరుణ గోపాల్ తెలిపారు. శనివారం ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరుణ గోపాల్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన దాదాపు 150 మంది మహిళలు యువకులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరుణ గోపాల్ మాట్లాడుతూ దేశంలో మోడీ పరిపాలన కు ఆకర్షితులై స్వచ్ఛందంగా మహిళలు యువకులు బిజెపి పార్టీలో చేరుతున్నారు. మళ్లీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పగ్గాలు చేపడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కుప్పు స్వామి, లయన్ విజయ్ కుమార్, లయన్ రాజా రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు