
చందుర్తి, నేటిధాత్రి:
మేడారం సమ్మక్క సారక్క జాతర పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని ఏకైక దేవాలయమైన మల్యాల గ్రామంలో గ్రామ శివారులో ఉన్న సమ్మక్క సారలమ్మ దేవాలయంలో శనివారం రోజున ఉదయం ఆలయంలో ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణచార్యులు అమ్మవారికి బోనాలు ప్రత్యేక పూజలు అభిషేకం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండేళ్లకి ఒకసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని మన మల్యాల గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర మహా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు