
రాష్ట్ర ప్రభుత్వనీకి టిటిఎఫ్ సంఘం విజ్ఞప్తి
టీటీఎఫ్ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షులు
రాములు నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్ .ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు భానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ 2008 డీఎస్సీలో అర్హత సాధించిన బీఈడీ 1200 మంది అభ్యర్థులను తక్షణమే నియామక ఉత్తర్వులు అందించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా భానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ 2008 సంవత్సరములో డీఎస్సీ నోటిఫికేషన్లో నియమ నిబంధనల ప్రకారం మెరిట్ సాధించారనీ అన్నారు నియామక ఉత్తర్వులు కోసం వేచి ఉన్న సందర్భంలో ఎస్జీటీ పోస్టులో రిజర్వేషన్ డిఈడి అభ్యర్థులకు 30 శాతం అని 2009 జనవరి 29న జీవో నెంబర్ 28 తీసుకొచ్చి 2008డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మెరిట్ సాధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 3500 బిఈడి అభ్యర్థుల జీవితాలను ఈ జీవో అగమ్యగోచరంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికి న్యాయం కోసం గత 15 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన 2300 మంది అభ్యర్థులుకు అక్కడి ప్రభుత్వం మూడేళ్ల క్రితం పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా పాఠశాలల లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరుణంలో ఆనాటి ప్రభుత్వము నీళ్లు నిధులు నియామకాలు అని నినాదంతో కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో మాత్రం 15 సంవత్సరాల నుంచి 1200 మంది అభ్యర్థులు ఒకవైపు న్యాయస్థానంలో పోరాటం చేస్తూ మరొకవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు ధర్నాలు, రాస్తారోకోలు,నిరాహార దీక్షలు,చేసినా గత ప్రభుత్వం హామీలకే పరిమితమైంది తప్ప న్యాయం చేయలేదని అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా బిఈడి మరియు డిఇడి అభ్యర్థులకు కామన్ మెరిట్ ప్రకారమే పోస్టింగ్ ఇవ్వాలని తీర్మానించింది ఈ నిర్ణయాన్ని అనుసరించి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2010 జూన్ 21న జీవో నెంబర్ 27 నీ విడుదల చేస్తూ అందరికీ కామన్ మెరిట్ ప్రకారమే పోస్టింగ్ ఇవ్వాలని సూచించింది జీవో నెంబర్ 27 ప్రకారమే పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయాలని సుప్రీంకోర్టు 2013 జూలై 15న రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది 2017 ఫిబ్రవరి 8 హైకోర్టు ధర్మాసనం మరియు 2022 సెప్టెంబర్ 27లో గౌరవ తెలంగాణ హైకోర్టు బీఈడీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది కానీ అప్పటి ప్రభుత్వం వారి గోడును న్యాయస్థానం తీర్పును పట్టించుకోలేదని అన్నారు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి న్యాయస్థానం తీర్పును అనుసరించి 2008 డీఎస్సీలో మెరిట్ సాధించిన సుమారు 1200 మంది బిఈడి అభ్యర్థులను నియామక ఉత్తర్వులు అందించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయగలరని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము