
# కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి దంపతులు
వరంగల్ / గీసుకొండ,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు, ప్రజాసేవకులు అల్లం స్వప్న దేవి బాల కిషోర్ రెడ్డి దంపతులు 75 వేల రూపాయల విలువైన శఠగోపాన్ని ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య గౌడ్,కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీనివాస్, కొమ్ము శ్రీకాంత్, కందికొండ రాజు, మాదాసి రాంబాబు, అనిల్, కనకయ్య, రాజమౌళి, సాంబయ్య, మహేందర్, రాజు,మల్లేష్, చేరాలు, బొందాలు, కుమార్, రాజు, కమలాకర్, ఎల్కుర్తి ఆరెపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నల్ల సురేష్ బాబు, తిప్పారపు శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రమేష్, అశోక్, రాజిరెడ్డి, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.