
సిఐటియు చండూర్ మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్అనే రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులపై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్కకంఠంతో ఖండించాలనిఆయన అన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులపై దాడి చేసి చంపడం దుర్మార్మైన చర్య అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 21న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతంగంపైపంజాబ్, హర్యానా సరిహద్దు.ఖీ నౌరీ వద్ద రైతాంగం పై పోలీస్ యంత్రాంగం జరిపిన పాశావికదాడుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాని తెలియజేస్తున్నామని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా. రైతాంగం పై కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారనిఅన్నారు. పోలీస్ కాల్పుల్లోమరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, పోలీస్ కాల్పుల్లో క్షతగాత్రులైనరైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఆర్థికం సాయం అందించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందనిఅన్నారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోమోదీ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.