భీమారం, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లి గ్రామంలో జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం రోజు క్షేత్ర సాయి పర్యటన చేపట్టారు.
స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషాత్మక తులనం, సామాజిక వనరులు, ప్రిఫరెన్స్ ర్యాకింగ్, సమస్యల చెట్ల కార్యక్రమం తదితర అంశాలపై ముగ్గులతో చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగరాజు, శివకృష్ణ పొలాస విద్యార్థులు అక్బర్ ఖాన్, బి. మనోజ్, ఏ.విశాల్, కే. ప్రణయ్, యండి.ఉబేద్, వ్యవసాయ విస్తరణ అధికారి బొల్లంపల్లి అరుణ్ కుమార్ గౌడ్, బి. శ్రీధర్, బి. చంద్రమౌళి పాల్గొన్నారు.