
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెలిసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవం శనివారం రోజున మహా ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వామివారి ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం శాలువులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మరియు లింగంపేట గ్రామ ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.