మార్చి3న విలీన బహిరంగ సభ విజయవంతానికి విస్తృత ప్రచారం

సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా)

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
మార్చి3న ఖమ్మం నగరంలో జరిగే విలీన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పోతిరెడ్డిగూడెం ,జగ్గాయి గూడెం, గుండాల గ్రామాలలో బహిరంగ సభ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లను విస్తృతంగా గోడలకు అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలు వాంకుడోత్ అజయ్, మోకాళ్ళ ఆజాద్, తేల్లం రాజు లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా, పిసిసి సిపిఐ (ఎంఎల్), సిపిఐ(ఎంఎల్)ఆర్ఐ మూడు పార్టీలు ఐక్యమవుతున్న సందర్భంగా మార్చి మూడో తారీఖున ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని అన్నారు. ఇండియా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని, మనువాద హిందుత్వ, కార్పోరేట్ పాసిస్టు మతతత్వ రాజ్యస్థాపనను ఎదుర్కోవడమే మన తక్షణ కర్తవ్యం అని అన్నారు .బిజెపిని, ఎన్డీఏను ఎదుర్కోవడానికి ఫాసిస్టు వ్యతిరేక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, దానిలో మనం క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. కామ్రేడ్ రంగయ్య అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్, కామ్రేడ్ పోటు రంగారావు, కామ్రేడ్ సుభాష్ దేవ్ ,కామ్రేడ్ సంజయ్ సింగ్వి, కామ్రేడ్ దినేష్ గో హైన్, కామ్రేడ్ కేజీ రామచందర్, కామ్రేడ్ కె.రమ, కామ్రేడ్ ఆర్. చంద్రశేఖర్, కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య, కామ్రేడ్ గోకెనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని వారన్నారు. యూనిటీ విలీన బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నాయకులు పూనెం లక్ష్మయ్య, వూకే శ్రావణ్, ఈసం లక్ష్మీనారాయణ, ఈసం వసంతరావు, అరెం మంగయ్య, ఎట్టి నర్సయ్య, పూనెం ప్రభాకర్, వాగబోయిన మోహన్ రావు, వూకే వెంకన్న, వాగబోయిన శ్రీవేణి, ఈసం నాగేశ్వరరావు, ధారావత్ ఆల్యా తదితరులు పాల్గొన్నారు. ‌ ‌ ‌ ‌ ‌ ‌‌‍ ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!