నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కృషి…
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గట్టయ్య
రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 24, నేటిధాత్రి:
క్యాతనపల్లి ప్రెస్క్లబ్కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రతినిధులు శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ప్రెస్‌క్లబ్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది.ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు వెంగళదాసు సంతోష్ ,తాండ్ర సతీష్ లు గెలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ నూతన అధ్యక్షుడు పిలుమాల్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి గంగారపు గౌతమ్, కోశాధికారి మారేపల్లి వేణు గోపాల్ రెడ్డి లకు శనివారం పదవీ బాధ్యతలు అప్పగించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన తాండ్ర సతీష్, వెంగళదాసు సంతోష్ లు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులుగా కొనసాగుతారని ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. నూతన ప్రెస్ క్లబ్ కమిటీలో ముఖ్య సలహాదారులుగా ఈదునూరి సారంగారావు, కార్యనిర్వహణ అధ్యక్షులు ఆరెల్లి గోపికృష్ణ, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య, ప్రచార కార్యదర్శి కొండా శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బండ అమర్నాథ్ రెడ్డి లు కొనసాగతారని ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య మాట్లాడుతూ .. పాత్రికేయులందరూ సమిష్ఠిగా కలిసి మెలసి పనిచేసి క్యాతనపల్లి ప్రెస్‌క్లబ్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. క్లబ్ కార్యాలయానికి కృషి చేస్తానని అన్నారు. క్లబ్‌కి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కొనసాగుతూ ప్రజా సమస్యలు అధికారులకు పాలకవర్గ నాయకులకు చేరవేస్తూ ప్రెస్ క్లబ్ ను ముందుకు కొనసాగిద్దామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు ఆరెంద స్వామి, పిడి రాజేంద్రప్రసాద్, కొమ్ము సదానందం, పురుషోత్తం గంగన్న యాదవ్,దాసరి స్వామి,శ్రీనాథ్,వెంకటస్వామి, మోరె రవి లు పాల్గొన్నారు.