రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీ నిధుల నుండి అధునాతన అంబులెన్స్ ఇచ్చిన సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈసందర్భంగా ఎంపీ నిధుల నుండి గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన అధునాతన అంబులెన్స్ యొక్క ప్రోసోడింగ్ కాపీని పి.హెచ్.సి డా.గ్రీష్మనియాకి అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.