చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం ఎనగంటి- బండపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును తప్పించబోయి ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొనడంతో బైక్ పై ఉన్నటువంటి యువతీతో పాటు యువకునికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను స్థానిక వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కారును తప్పించబోయి చెట్టును ఢికొని ఇద్దరికీ గాయాలు
