
ఏటేటా భక్తుల నమ్మకం, రద్దీ పెరుగుతుంది!!
ఉత్సవ కమిటీ చైర్మన్ ఏలేటి శైలేందర్ రెడ్డి!!
జగిత్యాల, నేటి ధాత్రి
సమ్మక్క – సారలమ్మ జాతర మినీ మేడారంగా ,అంగ రంగ వైభవంగా తలపిస్తున్న, సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించబడుతుంది
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో అంగ రంగ వైభవంగా నిర్వహించ బడుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే
ఈ సమ్మక్క సారలమ్మ జాతర రాజారాంపల్లి లో ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు కమిటీ చైర్మన్ సభ్యులు అందరి సహాకారంతో అందరూ భాగస్వాములై ఇట్టి జాతరను నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఏలేటి శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాలు నుండి ఇప్పటి వరకు అనగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తారు కాబట్టి ఇది ఆరవ సారి కూడా జాతర ఘనంగా జరుగుతుంది,ప్రతి ఏటా భక్తుల నమ్మకం రద్దీ పెరిగింది, మినీ మేడారం గా కొలిచే రాజరాంపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి అశేష భక్త జనం తరలి వచ్చి,కొలిచిన వెంటనే కోరికలు నెరవేర్చే, వన దేవత లైన సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం ,అర్పిస్తారు,కాగా
బుధవారం రోజున అడవి నుంచి సారలమ్మ ,పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి ప్రవేశంతో ప్రారంభమై,తర్వాత రోజున
గురువారం రోజున గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై కొలువు దీరడం మరియు
శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు,నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు.
శనివారం రోజున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది అని నిర్వాహకులు తెలిపారు