
ఎండపల్లి నేటిధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో గల కొత్తపేట, ఎండపల్లి,ఉమ్మడి వెల్గటూర్ మండలంలో వ్యవసాయశాఖ ఏడీఎ రాంచందర్ ఆకస్మిక తనిఖిలు చేశారువెల్గటూర్ ,ఎండపల్లి మండలలో ధర్మపురి డివిజన్ ఏడీఏ (ఆర్)రాంచందర్ ఫర్టిలైజర్ షాప్ లలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది.షాప్ లలో నిల్వ రిజిస్టర్ లు , ఆన్లైన్ ఈ పాస్ బిల్లు లు తనిఖీ చేయడం జరిగింది .ప్రతి రైతుకు ఈ పాస్ ద్వారానే ఎరువులు,ఇవ్వాలని ,తప్పనిసరి బిల్లులు ఇవ్వాలని నిల్వ ,రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనీ హెచ్చరించడం జరిగింది.ఎండపల్లి ,కొత్తపేట,వెల్గటూరులోని ఎరువుల క్రిమిసంహారక మందుల దుకాణాలు తనిఖీలు చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఏడీఎ తో పాటు ఏఈఓ లు అయ్యోరి వినోద్ ,అజయ్ ,భువన్ లు పాల్గొన్నారు.