
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బి. రాములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లురవిని నాగర్ కర్నూల్ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలచే డాక్టర్ మల్లురవిని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా నియమాకం కావడం పట్ల మహబూబ్ నగర్ జిల్లాకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బి. రాములు బి. జంగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.