రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. ఈకార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, తహశీల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీడీవో రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, ఎంపీటీసీలు బొమ్మరవేని తిరుమల, జవ్వాజి హరీష్, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.