చందుర్తి, నేటిధాత్రి:
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధం కావాలని అగ్రహారం పాలిటెక్నిక్ అధ్యాపకులు మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ … అందరికి అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ చదవవచ్చు అన్నారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు నేరుగా బీటెక్ రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు అన్నారు. పాలిటెక్నిక్ లో ప్రవేశం కోసం ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్, వసతి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, దశరథం, రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, కల్పన, తదితరు పాల్గొన్నారు.