
ఎవ్వరు వచ్చినా మేనేజ్ చేసుకుంటామని బోర్ వెల్ యాజమాన్యులు ధీమా…
మల్కాజిగిరి,నేటిధాత్రి:
ఒకపక్క భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే, మరోపక్క బోర్వెల్ యజమానులు అక్రమంగా వేల అడుగులు ఆరున్నర అంగుళాల బోరింగులు వేస్తూ భూమిని జల్లడగా మారుస్తున్నారు. మల్కాజ్గిరి లో 10 నుండి 20 అడుగుల్లో ఒక బోరు వేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మల్కాజ్గిరి లో నీటి చుక్క కోసం విలవిలలాడే పరిస్థితిని మల్కాజ్గిరి ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బోర్వెల్ యజమానులు అక్రమంగా ఆరున్నర అంగుళాల బోర్లు తమ ఇష్టం రాజ్యాంగ వేస్తున్న వారిని అడ్డుకునే నాధుడే మల్కాజ్గిరిలో కరువయ్యాడు. ఆరున్నర అంగుళాల బోరు వేస్తే తమ కాలనీలో నీటి ఏడ్డదా ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న,బోర్వెల్ యజమానులను అడ్డుకోకపోవడం చూస్తుంటే బోర్వెల్ యజమానులతో అధికారుల కనుసైగల్లోనే తమల పనులు కానిస్తున్నారని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.