#జెడ్పి లో లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:ప్రతి ఉద్యోగి కి ఒక చోట నుండి మరోచోటికి బదిలీ తప్పనిసరి అని నల్లబెల్లి జడ్పిటిసి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.ఇటీవల నల్లబెల్లి మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్ విజయ్ కుమార్ బదిలీపై వెళ్లడంతో వీడ్కోల సమావేశాన్ని ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పి ఫ్లోర్ లీడర్ సప్న మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి బదిలీ అనేది తప్పనిసరి అన్న విషయం జగమెరిగిన సత్యం అని తాను పనిచేసే కార్యాలయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన కర్తవ్యాన్ని పారదర్శకంగా నిర్వర్తించినప్పుడు ఆ ఉద్యోగి చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతాడని ఆమె గుర్తు చేశారు. ఏ ఉద్యోగి అయినా తమ విధుల పట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులను అధిరోహించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆ ఉద్యోగి ఎక్కడికి వెళ్ళినా రాణించవచ్చని ఆమె గుర్తు చేశారు. అనంతరం ఎంపీడీవో ఎన్ విజయకుమార్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజేష్. నూతన ఎంపీడీవో జి నరసింహమూర్తి. మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్. వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా. పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపెళ్లి మురళీధర్ రావు. మాజీ ఎంపీపీలు కక్కర్ల శ్రీనివాస్ గౌడ్. బానోతు సారంగపాణి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు పాలపు రాజేశ్వరరావు. ఎంపీటీసీలు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది. పంచాయతీ కార్యదర్శులు. ఇటీవల పదవి విరమణ పొందిన ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.