
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం కొలనూర్ గ్రామ శివారులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర జరుగు ప్రదేశాలను పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ జగదీష్,పొత్కపల్లి ఎస్ఐ జి.అశోక్ రెడ్డి, పరిశీలించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి కృష్ణ, మాట్లాడుతూ కొలనూరు జాతరకు వచ్చే ప్రజలు పోలీసుల సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని వెళ్లాలని సూచించారు. పోలీసులు చూపించిన ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని ప్రజలకు ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. జాతర జరుగు ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జాతర నిర్వహించే నిర్వాహకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.