
హెచ్ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎస్ టి పి పి లో అనుభవం ఉన్న అధికారులను నియమించాలి.137 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న సింగరేణికి పవర్ ప్రాజెక్టులపై పూర్తిగా కావాల్సిన ఇంజనీర్ అధికారులు ఉన్నా కూడా పదవీ విరమణ చేసిన అధికారులను నియమించడం సింగరేణి చరిత్రలో సిగ్గుచేటు. సింగరేణి అధికారులను కించపరిచారు. సింగరేణి ఆధీనంలో పవర్ ప్రాజెక్టులు కుడా 100 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు లేకున్నా పర్మినెంట్ కార్మికులతో నడిపించారు.కానీ ఎస్టీపీపీలో రిటైర్డ్ అధికారులను నియమించడం సిగ్గుచేటు. వెంటనే భూనిర్వాసితులకు కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి. సింగరేణి అధికారిని ఓ అండ్ ఎం చీఫ్ గా నియమించాలని హెచ్ ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు.