-విద్యార్థులను పరీక్షలకు మానసికంగా సన్నద్ధం చేసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుంది
-ఎం ఎస్ టి ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు బాలకృష్ణ
-టి ఎస్ యు టి ఎఫ్ మండల కమిటీ సభ్యులు సునీత
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), ఆధ్వర్యంలో ఈరోజు బోయినిపల్లి మోడల్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు, విద్యార్థులలో పోటీతత్వాన్ని నెలకొల్పేందుకు, రానున్న పరీక్షలకు సన్నద్దం చేసేందుకు, టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని ఎం ఎస్ టి ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు బాలకృష్ణ టి ఎస్ యు టి ఎఫ్ మండల కమిటీ సభ్యులు సునీత అన్నారు. అనంతరం ఎస్ ఎఫ్ ఐ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని అవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఇటువంటి టాలెంట్ టెస్ట్ లు ఉపయోగపడతాయని, ఎస్ ఎఫ్ ఐ నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ అభినందనీయం అని అన్నారు.
-ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్
మాట్లడుతూ బోయినిపల్లి మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్ట్ విజయవంతం అయ్యిందని మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ నిర్వహించే టాలెంట్ టెస్ట్ ను ఉపయోగించుకున్నారని రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసి వారి లోపల ఉన్న భయాన్ని పోగొట్టేందుకే ఎస్ ఎఫ్ ఐ ప్రతి సంవత్సరం ఇలాంటి టాలెంట్ టెస్ట్ పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తుందని ఇట్టి పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.