
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల్లే అవుతుందని,గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్ట ర్లకు బిల్లులు అందలేదు: జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి ఫిబ్రవరి 20 నేటి ధాత్రి ఇంచార్జ్
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభు త్వం ఏర్పడి 2 నెలలే అవుతుంద ని,కొంతమంది గౌరవ ప్రజా ప్రతినిధు
లకు స్పష్టమైన అవగాహన లేక గత 4 నెలలుగా పనులు జరగడం లేదు అనడంలో ఎంత మాత్రం నిజాం ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పు డు ఆరోపణలు చేయడం వారి విజ్ఞ తకే వదిలేస్తున్నామని అన్నారు మా దాపూర్ డివిజన్ కార్పొరేటర్,శేరి లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.ఈరోజు జిహె చ్.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి జీ.హెచ్.ఎం.సి అభివృద్ధిపై స్పష్ట మైన అవగాహన ఉంద ని,శేరిలిం గంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే గౌరవ ఇంచార్జ్ మంత్రివ ర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు ఆదే శాల మేరకు ప్రణాళికలు సిద్ధం చే యడం జరుగుతుందని,పెండిం గులో ఉన్న పనులు సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామ ని,శేరిలిం గంపల్లి నియోజకవర్గ పరిధిలో అన్యా క్రాంతం అవుతున్న పార్క్ స్థలాలను కాపాడే బాధ్యత మేయర్ కమిషనర్ తీసుకోవాలని ఈ సంద ర్భంగా విన్నవించారు.ఈ కార్యక్ర మంలో అల్లూరు కాంగ్రెస్ కార్యక ర్తలు కాంగ్రెస్ నాయకులు తదిత రులు పాల్గొన్నారు.