నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
సమ్మక్క సారలమ్మ జాతర స్థలాల్లో భక్తుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.కమలా పూర్ మండలములోని కమలా పూర్,కన్నుర్రు,మర్రిపల్లి గూడెం,మాధన్నపెట్ గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల సాని రమేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా కన్నూర్ జాతర కమిటీ చైర్మన్ నల్లని సురేష్ తో కలిసి మంత్రి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశములో వారితో పాటు హుజురాబాద్ నియోజకవర్గం యూత్ జనరల్ సెక్రెటరీ బిక్షపతి, జనగాని శివ కృష్ణ,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.