
సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం
దేవరుప్పుల నేటిదాత్రి ఫిబ్రవరి 19
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కుల గణన తీర్మానం చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన గణేష్ అన్నారు. సోమవారం దేవరుప్పుల మండల కేంద్రంలోని జనగామ – సూర్యాపేట జాతీయ ప్రధాన రహదారి చౌరస్తా ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కుల గణన బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తోనే బీసీ కుల గణన సాధ్యమైందన్నారు. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపితే బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశాలుంటాయని దేశ ప్రధాని బీసీ కులస్తుడై ఉండి కూడా బీసీలను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్య సజ్జన్ నాయక్ జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి తోటకూరి పాండుకృష్ణ మాజీ సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్ నాయకులు రెడ్డిరాజుల రమేష్ ఓడపల్లి రవి వరికెల రతన్ జీ బట్ట అబ్బయ్య బోనగిరి యాకస్వామి సోమనర్సయ్య పులిపంపుల భాస్కర్ వంగాల శోభన్ బాబు పులిగిల్ల వెంకన్న తోటకూరి రమేష్ మండల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.