
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి
మంగపేట, నేటిధాత్రి
బావిలో నీళ్లు తాగారని దళిత పిల్లలను అతి క్రూరంగా కట్టేసి కొట్టిన ఘటనను తీవ్రంగా ఖండి స్తునానని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు.ఈ మేరకు దళిత పిల్లలను కట్టేసి కొట్టిన సంఘటన పై స్పందించి స్థానిక విలేకరులతో మాట్లాడుతు అభం శుభం తెలియని ఐదుగురు దళిత పిల్లలు బాగా దాహం కావడంతో అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి బావిలో నీళ్లు తాగడంతో మా బావిలోని నీళ్లు తాగుతార అనే దుహం కారంతో విచక్షణ రహితంగా పిల్లలు అనే జాలి లేకుండా చేతులు వెనక్కి విరిచి తాడు తో కట్టేసి కనికరం లేకుండా కొట్టడం అమానుషం అని అన్నారు.ప్రపంచం ఎంతో ముందు పోతున్న ఇంకా ఇలాంటి దుశ్చర్యలకు పాల్ప డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమాయక దళిత పిల్లలను కేవలం నీళ్లు తాగారానే వంకతో ఇష్టాను సారంగా కొట్టి హింసించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి డిమాండ్ చేశారు.