
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 19, నేటిధాత్రి:
మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంట్ పరిధి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో చెన్నూర్ ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ….కాకా జీవితం సామాన్యుడిగా ప్రారంభించి 70 వేల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించారనీ అన్నారు.సింగరేణి సంస్థ నష్టాల బారిన పడినప్పుడు 400 కోట్లను ఇప్పించి సింగరేణిని కాపాడారని,
లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారని గుర్తు చేశారు.రూరల్ డెవలప్మెంట్ కోసం 1998 లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కొనసాగిన కాలంలో ఐదువేల బడ్జెట్ నుంచి 25వేల బడ్జెట్ పెంచేందుకు కృషి చేశారని,ప్రస్తుతం అది లక్ష కోట్లకు చేరుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా కే దక్కుతుందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ను ఒప్పించి ప్రాజెక్ట్ ఏర్పాటు కు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు.హెచ్ సి ఏ ప్రెసిడెంట్ గా నేను వున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించానని అన్నారు.పెద్దపల్లి పార్లమెంటుకు పరిమితం కాకుండా క్రికెట్ క్రీడను తెలంగాణ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి కాకా వెంకటస్వామి స్మారకార్థం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తాం అని అన్నారు.
యువనేత గడ్డం వంశీకృష్ణ ఆలోచనతోనే తెలంగాణ స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రెటరీ రఘునాథరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్ ఒడ్నాల శ్రీనివాస్,పలిగిరి కనకరాజు, కౌన్సిలర్లు పనాస రాజయ్య, పొలం సత్యం, పుల్లూరి సుధాకర్,నాయకులు బింగి శివ కిరణ్ ,ఎర్రబెల్లి రాజేష్ ,కొక్కుల సతీష్, గంగారపు సత్యపాల్, యువ నాయకులు క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.