
నర్సరీలల్లో కొత్త విత్తనాలను నాటలని,పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచన
పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున పరకాల మండల పరిధిలోని పైడిపల్లి, నాగారం మరియు లక్ష్మీ పురం గ్రామాలలో పర్యటించి నర్సరీ, అంగన్వాడీ సెంటర్లు మరియు పాఠశాలలను ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు తనఖీ చేసారు.నర్సరీ లో విత్తనాలు మొలకెత్తని బ్యాగులలో స్థానిక విత్తనాలు నాటాలని సంంభందిత ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.అనంతరం అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకు మరియు గర్భిణీలకు సరియైన సమయంలో పౌష్టికాహారం సరఫరా చేయాలని,పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.గ్రామ పంచాయతీలో అన్ని రికార్డులను వ్రాసి సిద్దంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,ఏపిఓ ఇందిర సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.