ఏజెన్సీ వాసుల సమస్య లను పరిష్కారం చేయాలి, “తుడుందె బ్బ” డిమాండ్

గంగారం/కొత్తగూడ, నేటిధాత్రి

అభివృద్ధి కి ఆమడ దూరం లో నెట్టివేయబడిన ఉమ్మడి కొత్తగూడ మండలం లోని ఆదివాసీ గిర్జన గూడేలు అనేక సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతూ వర్షాదారిత పంటల పై ఆధార పడి చాలి చాలని ఆర్థిక స్థోమతతో కాలం వెళ్ళదీస్తున్న ఆదివాసీ ఆదివాసీ, ఆదివాసేతర జనజీవనం అనేక బాధలు పడుతున్నరు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ప్రజా సమస్య ల పరిష్కారం చేయాలనీ ఈ రోజు కొత్తగూడ మండలo లోని వేలుబెల్లి గ్రామం లో తుడుందెబ్బ ముఖ్య కార్యకర్తల సమావేశo ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా కార్యదర్శి మంకిడి సతీష్ అధ్యక్ష్యతన ఏర్పాటు చేయగా రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి. పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి కొత్తగూడ మండలం లో ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు సొంతభవనాలు లేక ప్రజలకు అధికార యంత్రాంగం సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం తో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, విద్యాలయాలు కూడ సరైన వసతులు లేక విద్యార్థిని విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకో లేక పోతున్నారని,పాఠశాల లను సుందరికరుణ చేసి మౌలిక వసతులు కల్పించాలని ఉమ్మడి మండలం లో PHC లు హెల్త్ సెంటర్ లు ప్రజలకు వైద్య సదుపాయం అందించడం లో ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని వివిధ ప్రాంతాల్లో ఉండబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన సిబ్బంది లేక ఉన్న సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాకుండా ఉంటున్నారని MCH సిబ్బంది నామ మాత్రపు విధులను నిర్వర్తిస్తూ చేతులు దులుపుకుంటున్నారని వీటి పైన ద్రుష్టి సారించి ఆసుపత్రుల ను ఆపగ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి లి గా చేసి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యం గా మండల కేంద్రం లోని పశువుల వైద్యశాల భవనం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి కి నోచుకోకుండా సిద్ధిలావస్థలో ఉండబడి ఆ వైద్య శాలలో పని చేసే సిబ్బంది భయానక వాతావరణం లో పని చేయాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రంధాలయం కు సైతం సరైన ప్రాంతం లో భవనం లేకపోవడం తో పాఠకులు, కాంపిటేటివ్ అభ్యర్థులు పఠనం చేసే పరిస్థితి లేదని ఇక ఇక్కడ గత ఐదు సంవత్సరాల క్రితమే మంజూరి అయినా మహాత్మా జ్యోతి రావు ఫూలే తెలంగాణ రెసిడెన్సీయల్ బాలికల పాఠశాల (MJBRS )(G)ఇక్కడి నుండి తర్లించబడి ములుగు జిల్లాలోని ఆరెపల్లి లో కొనసాగుతుందని అట్టి పాఠశాలను వెంటనే కొత్తగూడ లో కొనసాగించాలని ఉమ్మడి కొత్తగూడ మండలం లో తాగు, సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదురుకొంటున్న రైతులు, ప్రజల అవసరం మేరకు పుట్టల భూపతి గ్రామ పరిసర ప్రాంతం లోని ఉండ బడిన పంది పంపుల వాగు పై రిజర్వాయర్ నిర్మాణం చేసి రెండు మండలాల ప్రజల దాహర్తి ని తీర్చడం తో పాటు సుమారు మూడు వేయిల ఎకరాల వ్యవసాయ భూములకు నీరంద చేయాలని రోడ్ సదుపాయాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయాని వాటికి లింక్ రోడ్ల తో పాటు అంతర్గత రోడ్లను మంజూరి చేయించాలని గంగారం మండలం మడగూడ లో సహజ వనరైన సున్నం లభిస్తుందని ఈ గ్రామంలో సున్నం సేకర్ణ చేసే కుటుంబాలు అధికంగా ఉన్నాయని ఇక్కడ సున్నం ఉత్పత్తి కర్మాగారం ఏరపాటు చేస్తే సుమారు 2500కుటుంబాలకు ఉపాధి ఉంటుందని కర్మాగారా ఏర్పాటు కు చొర్వ చూపాలని వేదురు బొంగు సైతం గంగారం మండలం లో అధికంగా లభిస్తుందని ఇందుకోసం కూడ బొంగు సేకర్ణ ను చేపట్టాలని అదే విధంగా పారెస్ట్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమణ చేసిన పూర్తిగా భూములు కోల్పోయిన రైతులకు తిరిగి ఇప్పించి వారికి రైతు భరోసా తో పాటు వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని కిష్టపురం లోని కుంటుబడిన మరమ్మగ్గాలా సెంటరును పునరుద్దరించి ఆయా గ్రామంలో ని ప్రజలకు జీవన భృతి కల్పించాలని ఉమ్మడి మండలం ను దత్తత తీసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయలను కల్పించి అన్ని విధాలుగా అభవృద్ధి చేసే దిశగా మోడల్ గ్రామాలుగా తీర్చి దిద్దాలని ఈ సమస్యలు పరిష్కారం కోసం మంత్రి సీతక్క చొర్వ చూపి ఈ ఉమ్మడి మండల ప్రజలు రాజకీయంగా అందరించిన ఇక్కడి ప్రజల ఋణం తీర్చుకోవాలని ఆదివాసీ ప్రజల తరుపున తుడుందెబ్బ డిమాండ్ చేస్తుందని పిలుపునిచ్చారు, కార్యక్రమం లో సిద్దబోయిన లక్ష్మీనారాయణ, జీవన్, దారం వీరాస్వామి, మంకిడి లక్ష్మీ పతి, ధనుసరి వెంకటేష్, ధనుసరి శరత్, ధనుసరి సారయ్య, రామయ్య, దుగ్గరాపు నాగేశ్వర్ రావు. లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *